Home >> News >> Latest News>> గొర్రెకుంట కేసు: నిద్రమాత్రలు అమ్మిందెవరు?

గొర్రెకుంట కేసు: నిద్రమాత్రలు అమ్మిందెవరు?
Published Date :6/3/2020 10:50:59 AM
గొర్రెకుంట కేసు: నిద్రమాత్రలు అమ్మిందెవరు?

గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని పాడుపడిన బావిలో తొమ్మిది మందిని వేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ ఘటనలో భా గంగా మృతులందరి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు వారు మత్తులోకి జారుకున్నాక హత్య చేశాడని పోలీసులు వెల్లడించా రు. ఇంత వరకు బాగానే ఉన్నా పెద్దమొత్తంలో నిద్ర మాత్రలు ఏ షాపులో కొనుగోలు చేశాడనే వివరాలు చెప్పకపోవడం గమనార్హం. విచారణలో భాగంగా నిందితుడు వరంగల్‌ చౌరస్తాలోని ఓ షాపులో మాత్రలు కొనుగోలు చేసినట్లు వెల్లడించాడని చెబుతున్నా ఆ షాపు పేరు బహిర్గతం చేయడం లేదు. దీని వెనుక ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.తొలుత చేసిన మహిళ హత్యను కప్పి పుచ్చుకునేందుకు నిందితుడు సంజయ్‌కుమార్‌ యాదవ్‌ మరో తొమ్మిది మందిని హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటన జరిగాక పోలీసులు పడక్బందీ వ్యూహంతో ఏడు బృందాలు విడిపోయి మూడు రోజుల్లోగా నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో తొమ్మిది మందిని ఒక్కడే హతమార్చాడని వెల్లడిందని చెప్పిన పోలీసులు.. ఇంత మందిని హతమార్చేందుకు గాను బాధితులకు మత్తు కోసం 60 వరకు నిద్రమాత్రలను ఉపయోగించాడని ప్రకటించారు. కానీ నిద్రమాత్రలు కొనుగోలు చేసిన మెడికల్‌ షాపు పేరు కనుక్కోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, పోలీసులకు షాపు పేరు తెలిసినా వెల్లడించడం లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి హంతుకుడిగా కఠిన శిక్షపడేలా చేస్తామని చెబుతున్న పోలీసులు.. మందుల షాపు విషయంలో మాత్రం తాత్సారం ఎందుకు చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రిస్క్రిప్షన్‌ లేకుండా దగ్గు, జలుబు మాత్రలు కూడా విక్రయించకూడదని మెడికల్‌ షాపుల నిర్వాహకులను రాష్ట్ర, జిల్లా అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ ఔషధ దుకాణాల నిర్వాహకులు తమ తీరును మార్చుకోవడం లేదని ఈ ఘటనలో వెల్లడైంది. గొర్రెకుంట ఘటనలో నిందితుడు ఉపయోగించిన 60 నిద్రమాత్రలు ఒక్క దుకాణంలోనే కొనుగోలు చేశాడా.. లేదంటే పలు షాపుల్లో తీసుకున్నాడా అనే ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. ఈ విషయంపై డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల వివరణ కోరగా హంతకుడు ఉపయోగించిన నిద్రమాత్రల బ్యాచ్‌ నెంబర్‌ను తమకు తెలియజేస్తే ఏ షాపులో ఔషధాలు కొనుగోలు చేశాడనేది తేలేతుతుందని చెబుతున్నారు. బ్యాచ్‌ నంబర్‌ వివరాలు తెలపాలని పోలీసులను సైతం కోరామని స్పష్టం చేస్తున్నారు.పోలీసుల విచారణలో హంతకుడు నిద్రమాత్రలు కొనుగోలు చేసిన ఔషధ దుకాణం పేరు వెల్లడించలేదా అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. హత్య జరిగిన తీరును పోలీసు అధికారులు పూర్తిస్థాయిలో వెల్లడించినా ఔషధ దుకాణాల పేర్లు మాత్రం బహిర్గతం చేయలేదు. దీంతో అసలు మతలబు ఏమిటనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు అధికారులు ఈ అంశంపై పెదవి విప్పకపోగా.. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మాత్రం మాత్రల బ్యాచ్‌ నంబర్‌ కోసం పోలీసులను అడిగామని చెప్పడం గమనార్
Related News Articles