Home >> News >> FIR>> 'మాయా చెంబు' ముఠా ఆటకట్టు

'మాయా చెంబు' ముఠా ఆటకట్టు
Published Date :2/15/2020 8:34:51 AM
'మాయా చెంబు' ముఠా ఆటకట్టు

మాయా చెంబు పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠా ఆటకట్టించారు పోలీసులు. 18 మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, సీసీఎస్‌ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీలు వివరాలు వెల్లడించారు. నిందితులు తమ వద్ద ఉన్న రాగి చెంబుకు రసాయనాలు పూసి ఆ చెంబు వద్ద టార్చ్‌లైట్‌ వేస్తే లైట్‌ ఆఫ్‌ అవుతుంది. దీంతో ఈ చెంబుకు అద్వితీయ శక్తులు ఉన్నాయని ఇది ఎవరి ఇంట్లో ఉంటే వారికి అదృష్టం కలిసి వస్తుందని వారు అనుకొన్న కార్యాలు నెరవేరుతాయని అమాయక ప్రజలను నమ్మించి వారికి రాగి చెంబును అమ్మి అధిక మొత్తంలో డబ్బులు తీసుకోవాలన్న పథకంతో గత మూడురోజులుగా గోరంట్ల పరిసర ప్రాంతాల్లో 18 మంది సభ్యుల ముఠా తిరుగుతోంది. విషయం తెలుసుకున్న డీఎస్పీ రమాకాంత్, సీసీఎస్‌ డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు గోరంట్ల సీఐ జయనాయక్, సీసీఎస్‌ సిబ్బంది గోరంట్ల సమీపంలోని యర్రబల్లి రోడ్డు బూదిలి క్రాస్‌ వద్ద గురువారం ఉదయం 9.30 గంటలకు 18 మంది ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడుకార్లు, ఒక స్కార్పియో, రెండు రాగి చెంబులు, ఒక టార్చిలైట్, రూ.30వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. 18 మందిపైనా కేసులు నమోదు చేశారు. ముఠాను చాకచక్యంగా అరెస్టు చేసిన గోరంట్ల సీఐ, సీసీఎస్‌ సిబ్బందిని డీఎస్పీలు అభినందించారు.




Related News Articles